హైదరాబాద్: బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు కుటుంబాలకు న్యాయం చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఎస్ఎల్ బిసి బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా అందించలేదని అన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ ’ఎక్స్‘ లో పోస్ట్ చేశారు. ఎస్ఎల్ బిసి టన్నెల్ ప్రమాదం జరిగి 200 రోజులైనా ప్రభుత్వాలు స్పందించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆరుగురి మృతదేహాలను ఇప్పటికీ వెలికి తీయలేదని కెటిఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరంలోని సమస్యలకు ఎన్ డిఎస్ఎ బృందాన్ని పంపించిన కేంద్రం ఇప్పుడు ఎందుకు పంపట్లేదని, ఎస్ఎల్ బిసి ఘటనపై దర్యాప్తునకు ఒక్క బృందాన్ని కూడా ఎందుకు పంపలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను బిజెపి కాపాడుతోందని, ఎస్ఎల్ బిసి వద్ద ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాం అని కెటిఆర్ సవాల్ విసిరారు.
Also Read : స్కూల్లోనే డ్రగ్స్ తయారీ