అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ నగరం కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే డయేరియా బాధితుల సంఖ్య 300 దాటింది. గత రాత్రి మరో 20 మంది ఆసుపత్రిలో చేర్పించారు. విషమంగా ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం 145 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. డయేరియా మృతుల కుటుంబాలను స్థానిక వైసిపి నేతలు, నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. 427 నీటి నమూనాలను సేకరించి పరీక్షించారు.
Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?
డయేరియా లక్షణాలు:
విరేచనం నీళ్లలాగా కావడం, వికారం, వాంతులవ్వడం, డీహైడ్రేషన్ కు గురికావడం, కాళ్లు, చేతులు లాగడం, జ్వరం, అలసట, కళ్లు తిరగడం, నోరు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, తీవ్రమైన కడుపు నొప్పి, పొత్తి నొప్పి వంటి లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలని వైద్యులు సూచిస్తున్నారు. పెద్దవారిలో వ్యాధి నిరోధక శక్తి తకక్తి ఉండడం వల్ల చాల మంది ఈ డయేరియా బారినపడుతారు. అయితే ఈ సమస్య ఎక్కువ కాకముందే సరైన సమయంలో గుర్తించి వైద్యుల సలహా తీసుకోవడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాలి.
డయేరియా వచ్చినప్పుడు పాటించాల్సిహనన నియమాలు:
డయేరియా సమస్యతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్, కాఫీ, కార్బొనేటెడ్ పానీయాలతో పాటు వేయించిన ఆహార పదార్థాలు మరియు వేపల్లను తీసుకోకూడదు. తీపి పదార్థాలు, తేనె, ద్రాక్ష పళ్లు, చెర్రీలూ, స్వీట్లు, చాక్లెట్లు తినకుండా ఉండడం మంచిది. వేడిగా లేని పదార్థాలను తినడం, నీటిని తాగడం మానుకోవాలి. వీలైనంత వరకు వీధి వ్యాపారులు, ట్రక్కుల దగ్గర తినకపోవడం మంచిది. నీళ్లతో కాచిన సగ్గుబియ్యం జావ, ఓటీ, ఓట్లతో పల్చటి మజ్జిగ, గంజి లాంటివి తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.