ఆసియాకప్-2025లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. అయితే ఇన్ని రోజులు లేని నిరసనలు సరిగ్గా మ్యాచ్‌కి ముందు ఉధృతిగా మారాయి. ఈ మ్యాచ్‌కి బాయ్‌కాట్ చేయాలంటూ కొందరు నిరసన తెలుపుతూ సోషల్‌మీడియాలో ‘బాయ్‌కాట్’ను ట్రెండ్ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత్ పాల్గొనవద్దని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ హైటెన్షన్ నేపథ్యంలో టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ Gautam Gambhir) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ట్రెండ్ కారణంగా ఆటగాళ్లు ఏకగ్రత కోల్పోకుండా.. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా ఉండాలని సూచినట్లు సహాయక కోచ్ రైన్ టెన్ దస్కతే తెలిపారు. మ్యాచ్‌కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోచ్, కెప్టెన్ల బదులుగా దస్కతే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రజల భావోద్వేగాలు క్రికెటర్లపై అదనపు ఒత్తిడిగా భావిస్తున్నారా?. అని అడిన ప్రశ్నకు ‘‘దేశ ప్రజల సెంటిమెంట్లు, భావాలపై మాకు అవగాహన ఉంది. గంభీర్ (Gautam Gambhir) కూడా ఆటగాళ్లను ప్రొఫెనల్‌గా ఉండాలని సూచించారు. మన నియంత్రణలో లేని వాటి గురించి ఆందోళన అవసరం లేదు. భారతీయులు అత్యంత కరుణ కలిగిన వాళ్లు. వాళ్ల బాధని క్రికెటర్లు పంచుకుంటారు. ఇలాంటి సమయంలో ప్రతి మాట జాగ్రత్తగా వాడాలి. ఇలాంటి పరిస్థితులు వస్తాయనుకోలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వ విధానం ఎలా ఉంటే అలా నడుచుకుంటున్నాం. జట్టులో ప్రతి ఆటగాడు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి’’ అని దస్కతె తెలిపారు.
Also Fead: సమరానికి సర్వం సిద్ధం.. నేడు పాక్‌తో భారత్ పోరు