Sunday, September 14, 2025

హనీట్రాప్‌లో యోగా గురువు.. ఐదుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డబ్బులు సంపాదించడానికి సులభమైన మార్గాలు ఎంచుకుంటున్నారు కొందరు వ్యక్తులు. అలా ఎంచుకుంటున్న మార్గాల్లో ఒకటి హనీట్రాప్(Honey Trap). మహిళలను అడ్డంపెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసి.. లక్షల్లో డబ్బు కాజేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో హనీట్రాప్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో యోగాశ్రమం నడుపుతున్నాడు రంగారెడ్డి అనే వ్యక్తి. అయితే అతని వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయవచ్చని అమర్ గ్యాంగ్ స్కెచ్ వేసింది.

తొలుత అనారోగ్య సమస్యలో ఇద్దరు మహిళలు ఆశ్రమంలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ ఇద్దరు మహిళలు రంగారెడ్డితో క్లోజ్‌గా (Honey Trap) మూవ్ అవ్వడం మొదలు పెట్టారు. అతడితో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు తీశారు. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించారు. తొలుత రూ.50 లక్షల డబ్బు డిమాండ్ చేశారు. దీంతో ఆ డబ్బుకు సంబంధించిన చెక్కులు ఇచ్చాడు రంగారెడ్డి.

అంతటితో ఆగకుండా మరో రూ.2 కోట్లు డిమాండ్ చేశారు అమర్ అండ్ గ్యాంగ్. దీంతో బాధితుడు గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బుల ఇస్తామని చెప్పి గోల్కొండకు రమన్ని పోలీసులు వల పన్నారు. అక్కడకు వచ్చిన ఐదుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు అమర్, మౌలాలి, రాజేశ్, మంజుల, రజనిలు అని తెలుస్తోంది. అరెస్ట్ చేసిన నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు.

Also Read : నాగోల్ లో భార్య గొంతు కోసిన భర్త….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News