Sunday, September 14, 2025

నాపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధమే : మోడీ

- Advertisement -
- Advertisement -

అసోం: మాజీ ప్రధాన మంత్రి నెహ్రూ సర్కార్ తప్పిదాల ఫలితాలను ఇప్పటికీ అసోం ప్రజలు అనుభవిస్తున్నారని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత రత్న అవార్డు గ్రహీత భూపెన్ హజారికాపై కాంగ్రెస్ విమర్శలు దారుణమని అన్నారు. అసోంలో పలు అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మోడీ అసోంలో మీడియాతో మాట్లాడుతూ..1962 చైనా చొరబాటు సమయంలో నెహ్రూ సర్కార్ అనేక తప్పిదాలు చేసిందని, అసోం పుత్రుడు గాయకుడు, మాజీ ఎమ్మెల్యే భూపేన్ హజారికాను కాంగ్రెస్ అవమానించిందని మండిపడ్డారు. అసోంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల 13 శాతం వృద్ధి రేటు సాధ్యమైందని, తనపై విమర్శలకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని అన్నారు. తాను శివ భక్తుడినని విమర్శల విషాన్నిదిగ మింగుతానని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

Also Read : కొండా సురేఖ వర్సెస్ నాయిని… భగ్గుమన్న విభేదాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News