తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరాయ్’. రితిక నాయక్ ఈ సినిమాలో హీరోయిన్. సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబడుతోంది. అయితే ఈ సినిమాతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamaneni) పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిపోయాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కార్తీక్ ఛాన్స్ కొట్టేశాడు.
అయితే అది దర్శకుడిగా కాదు. వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో మరో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్ (Karthik Gattamaneni) పని చేయనున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ గతంలో నిన్ను కోరి, ఎక్స్‌ప్రెస్ రాజా, ధమాకా, కార్తీకేయ, చిత్రలహరి వంటి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మిరాయ్‌కి కూడా దర్శకుడిగా మాత్రమే కాకుండా.. సినిమాటోగ్రాఫర్ కూడా కార్తీక్ పని చేయడం విశేషం. ఇఫ్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాకి అతనికి సినిమాటోగ్రాఫర్‌గా వస్తే.. అతను చిరంజీవిని ఎలా చూపిస్తాడని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read : బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘మిరాయ్’