- Advertisement -
గౌహతి: అస్సాంలో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. ఉదల్గురిలో 5 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని తెలిపింది. అస్సాంతోపాటు పశ్చిమ బెంగాల్, భూటాన్ లలో కూడా ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు.
“అస్సాంలో భూకంపం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయంతో తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. నివేదికల ప్రకారం.. విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తున్నాయి. ఇప్పటివరకు, ఎటువంటి గాయాలు సంభవించలేదు” అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.
- Advertisement -