ఆసియాకప్‌లో భాగంగా భారత్ (Team India), పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ని భారత్ బాయ్‌కాట్ చేయాలంటూ.. నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కానీ, కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకు ఈ మ్యాచ్‌లో పాల్గొంటున్నట్లు భారత క్రికెట్ టీం మేనేజ్‌మెంట్ చెప్పింది. అయితే ఈ మ్యాచ్ కోసం భారత క్రికెట్ టీం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పహల్గాంలో ఉగ్రవాద దాడికి నిరసనగా ఈ మ్యాచ్‌లో భారత (Team India) ఆటగాళ్లు నల్ల బ్యాడ్జీలు ధరించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా పాకిస్థాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్‌లు కూడా చేసే అవకాశాలు లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ జట్టు ఈ మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదని నిపుణుల అభిప్రాయం. కానీ, పాకిస్థాన్ మాజీలు మాత్రం భారత్‌పై పాక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read : భారత్‌తో పోరు అంత ఈజీ కాదు: అజారుద్ధీన్