Sunday, September 14, 2025

ఆసియాకప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఆసియాకప్-2025లో హై-వోల్టేజీ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ ఈ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ (India VS Pakistan) జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. భారత్, యుఎఇపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. పాకిస్థాన్, ఒమాన్‌పై 93 పరుగుల తేడాతో నెగ్గింది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు కోసం ఇరు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ గత మ్యాచ్‌లోని జట్టుతో బరిలోకి దిగుతుండగా.. పాకిస్థాన్‌ కూడా అదే జట్టుని కొనసాగిస్తోంది. (India VS Pakistan)

తుది జట్లు

ఇండియా : అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్(కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

పాకిస్థాన్ : సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హరీస్(కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.

Also Read : పాకిస్థాన్‌తో మ్యాచ్.. నల్లబ్యాడ్జీలతో భారత క్రికెటర్లు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News