Sunday, September 14, 2025

ఎంఎల్‌ఏ క్లబ్ ఎన్నికల్లో యునైటెడ్ ప్యానెల్ గెలుపు

- Advertisement -
- Advertisement -

బంజారాహిల్స్‌లోని శాసన సభ్యుల సాంస్కృతిక కేంద్రం (ఎంఎల్‌ఏ క్లబ్) 2025, 2027 సంవత్సరాలకు గాను ఆదివారం జరిగిన ఎన్నికల్లో యునైటెడ్ ప్యానెల్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి పి. నారాయణ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నూతన అధ్యక్షులుగా డాక్టర్ వైవై రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె. రామచంద్రా రెడ్డి, కోశాధికారిగా జి. మధుసూధన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కె.లక్ష్మి రెడ్డి, సంయుక్ల కార్యదర్శిగా ఎం. ఉపేందర్ రెడ్డి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. దీంతో పాటు సభ్యులుగా పి. వేణుగోపాల్ రెడ్డి, డి. కృష్ణ మోహన్ రెడ్డి, మీరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏ. గోపాల్ రెడ్డి, కె. మహేష్ కుమార్, ఎం. కిషన్ రెడ్డి, పి. శాంతన్ రెడ్డి, ఏ. రఘురామి రెడ్డి, వై శ్రీకాంత్ రెడ్డిలు ఎన్నియ్యారన్నారు.

Also REad: ఈ నెల 17 నుంచి పోషణ మాసం ప్రారంభం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News