Sunday, September 14, 2025

ఇంజనీర్లకు సిఎం ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

తమ మేధో శక్తితో మానవ మనుగడకు ఎన్నో ఫలాలు అందించిన ఘనత ఇంజనీర్తదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇంజనీర్ల డే సందర్భంగా ఇంజనీర్లందరికీ సిఎం శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఆర్ధికాభివృద్ధికి, భారతావని ప్రగతికి బలమైన పునాదులు నిర్మించిన భారతరత్న మెక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా ఆయన జ్ఞాపకార్దం సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డేగా జరుపుకోవడం జరుగుందని సిఎం పేర్కొన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరుగా, దార్శనికుడిగా విద్యాప్రదాతగా, నిపుణుడిగా, పారిశ్రామిక ప్రగతి చోదకుడిగా ప్రత్యేక చాటారన్నారు. అత్యుత్తమ ఇంజనీరింగ్ సాంకేతికతతో వివిధ రంగాలలో ఆయన చేసిన కృషి భారతదేశ ఇంజనీరింగ్ రంగానికి ఆదర్శంగా నిలిచిందని సిఎం చెప్పారు. మూసి వరదల నుంచి హైదరాబాదు నగరాన్ని రక్షించేందుకు జల నియంత్రణ ప్రణాళికలు, ఎన్నో గొప్ప నిర్మాణాలు చేపట్టడంలో ప్రత్యేక చొరవ చూపించారన్నారు. రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు అందరూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్దిలో తమ వంతు పాత్ర పోషించాలని సిఎం పిలుపునిచ్చారు.

Also REad:7,441 బి.ఇడి సీట్లు భర్తీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News