Monday, September 15, 2025

అంతా నివ్వెరపోయేలా భారత్ ఆర్థిక వృద్ధి: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్

- Advertisement -
- Advertisement -

ఇండోర్: అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారతదేశం ప్రగతిపథంలో దూసుకువెళ్లుతోందని ఆర్‌ఎస్‌ఎస్ సంచాలకులు మోహన్ భగవత్ చెప్పారు. భారత్ పట్ల చిన్నచూపు ఆలోచనలు పనికిరావని రుజువు అయిందన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పుస్తకం పరిక్రమ కృపాసారం ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. విశ్వాసం, సాంప్రదాయక సిద్ధాంతాల విజ్ఞానం మార్గదర్శకాలతో సాగడం వల్లనే భారతదేశ ఆర్థిక పురోగమనం సాధ్యం అయిందని తెలిపారు. కార్యాచరణ, అంకితభావం పురాతన విజ్ఞాన ప్రాతిపదికలు మనకు గెలుపు సాధ్యం చేశాయని అన్నారు.

దేశ ఆర్థిక రంగం ఇప్పుడు ఎప్రిల్ జూన్ త్రైమాసికంలో 7.80 శాతం ప్రగతి సూచిని సాధించిన దశలో ఆర్‌ఎస్‌ఎస్ నేత వ్యాఖ్యలు వెలువడ్డాయి. భారతదేశం 3వేల ఏండ్ల పాటు విశ్వనేతగా చలామణిలో ఉన్నప్పుడు ప్రపంచ స్థాయిలో ఎక్కడా ఘర్షణలు లేవని ఆయన వివరించారు. ప్రపంచంలో ఇప్పుడు నెలకొన్న ఘర్షణలకు వ్యక్తిగత ప్రయోజనాలే కారణం అని, దీనితోనే అనేక సమస్యలు వీడని సంక్షోభాలు నెలకొన్నాయని చెప్పారు. భారత్ ఛిన్నాభిన్నం అవుతుందని కొందరు పెద్దలు చెప్పిన మాటలు ఏనాడో శుద్ధ తప్పని తేలాయి. దేశం అఖండంగా నిలిచింది. ఇప్పుడు అద్వితీయంగా ఆర్థికంగా వెలుగొందుతోందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News