Monday, September 15, 2025

క్యాన్సర్ మందులు నివారణకు పనికిరావు: డాక్టర్ రాజీవ్

- Advertisement -
- Advertisement -

కొచ్చి: సరికొత్తగా వచ్చే క్యాన్సర్ మందులు వ్యాధి నివారణకు పనికిరావు. అయితే అంతకు ముందు క్యాన్సర్ చికిత్స పొందిన వారికి ఇవి పనికొస్తాయి. ఈ విషయాన్ని వైద్య నిపుణులు డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. చికిత్స పొంది ఉన్నవారికి కొత్త మందులు లేదా వ్యాక్సిన్లు పనికివస్తాయని అభిప్రాయపడ్డారు. కేరళ రాష్ట్ర ఐఎంఎ అనుబంధ పరిశోధనా విభాగం కన్వీనర్‌గా, కొచ్చిన్ ఐఎంఎ సైంటిఫిక్ కమిటీ ఛైర్మన్‌గా రాజీవ్ జయదేవన్ వ్యవహరిస్తున్నారు. కోచ్చిలో కీలకమైన గాస్ట్రో ఇంటైస్టెయినల్ ఆంకాలజీ సొసైటీ రెండవ వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. మార్కెట్‌లోకి పలు పరిశోధనల క్రమంలోనే అనేక క్యాన్సర్ వ్యాక్సిన్లు దూసుకువస్తున్నాయి. వ్యాధి నిరోధకంలో ఇవి కీలకమైనవే, అయితే అవి ఏ స్థాయిలో ఏ విధంగా పనిచేస్తాయనేది ప్రధాన విషయం అన్నారు. ఏ మందు ముందుకు వచ్చినా అది ఎంత మేరకు పనిచేస్తుందనేది విశ్లేషించుకోవల్సి ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News