Monday, September 15, 2025

యూరియా కోసం క్యూలైన్‌లో సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/తొర్రూరు ప్రతినిధి: ప్రజలు నమ్ముకొని ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలు నరకాన్ని చూపిస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా, కురవి మండలంలోని తన స్వంత గ్రామంగుండ్రాతిమడుగు సొసైటీ వద్ద యూరియా కోసం మహిళలతో కలిసి ఆదివారం ఆమె క్యూలైన్‌లో నిలబడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు పంటను బతికించే అందుకు రాత్రింబవళ్లు యూరియా కోసం క్యూలైన్‌లో ఉంటున్న పరిస్థితులు దాపు రిచాయని మండిపడ్డారు. కాపాడుతారు.. మంచి చేస్తారని భావించిన ప్రజలకు ప్రజా ప్రభుత్వం నరకాన్ని చూపిస్తోంని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా అమలు చేయకపోగా రైతులను అన్ని రకాలుగా మోసగిస్తోందని ఆరోపించారు. రైతుల ఓట్ల కోసం ఎన్నో ఆకర్షణీయమైన హామీలను ఇచ్చిన కాంగ్రెస్‌ఇప్పుడు వారిని నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి చంపేస్తోందని అన్నారు. యూరియా కోసం వచ్చిన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కొంతమంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఎవరు కూడా యూరియా లభించకపోయిపా గుండెధైర్యంతో ఉండాలని, ప్రజల తరఫున, రైతులను ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచి అయినా యూరియా సాధిస్తామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News