Monday, September 15, 2025

మద్యం మత్తులో కన్నతల్లిపై అఘాయిత్యం.. కొడుకుని హతమార్చిన తండ్రి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: మానవత్వం రోజురోజుకూ మంట కలుస్తోంది. మద్యం మత్తులో మానవుడు వావివరుసలు మరుస్తున్నాడు. మద్యం వంటి నిషేధిత పదార్థాలను తాగినవారు ఆ మత్తులో ఎంతటి అఘాయిత్యానికైనా ఒడిగడుతున్నారు. అలాంటి సంఘటనే మహబూబ్‌నగర్ జిల్లా, జడ్చర్ల పట్టణంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాగిన మైకంలో తల్లిపై కుమారుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తన భార్యను కాపాడుకునే ప్రయత్నంలో కుమారుడిని తండ్రి హత్య చేశాడు. జడ్చర్ల పట్టణంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన శ్రీధర్ (31) తాగుడుకు బానిసయ్యాడు.

ఈ క్రమంలోనే మద్యం మత్తులో శనివారం అర్ధరాత్రి తన తల్లిని కోరిక తీర్చాలంటూ ప్రయత్నించాడు. దీంతో ఆమె ప్రతిఘటించింది. అక్కడే ఉన్న తండ్రి గమనించి ఆగ్రహంతో కర్రతో కొడుకుపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతూ తాగుడుకు బానిసై నిత్యం తల్లిదండ్రులను శ్రీధర్ ఇబ్బందులు పెట్టేవాడని స్థానికులు చెబుతున్నారు. తన భార్యను కాపాడుకునే యత్నంలో కొడుకును పోగొట్టుకోవడంతో తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News