Monday, September 15, 2025

అధికారంలోకి రాగానే..అధికారికంగా విమోచనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణలో అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బిజెపి చీఫ్ ఎన్.రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపా రు. కేంద్ర సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. నిజాం నిరంకుశ వైఖరిని ఎదిరిస్తూ ప్రజలు చేసిన పోరాటాలు, రజాకార్ల హింసాకాండ గురించి కళ్ళకు అ ద్దినట్లు ఉన్న పలు ఫొటోలను ప్రదర్శించారు. వీటి గురిం చి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని విమర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అయినా అధికారికంగా నిర్వహించడం లేదని ఆయన విమర్శించారు. అందరూ మజ్లిస్‌కు భయపడి అధికారికంగా నిర్వహించడం లేదన్నారు.

మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణలో తాము అధికారంలోకి రాగానే అధికారికంగా నిర్వహిస్తామన్నారు. గత రెండేళ్ళుగా కేంద్ర సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పుడు మూడో సారి నిర్వహించుకోబోతున్నామని ఆయన తెలిపారు. రజాకార్ల హింసాకాండపై ప్రజలు తిరుగుబాటు చేసి సాధించుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రసంగిస్తూ తెలంగాణలో అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించబోయే విమోచన దినోత్సవానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇంకా కేంద్ర మంత్రులు గజేంద్ర షెకావత్, జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, మహారాష్ట్రకు చెందిన పలువురు మంత్రులు, రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొంటారు. అదే రోజున ఉదయం సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని పార్కులో మాజీ ప్రధాని దివంగత ఎబి వాజ్‌పేయ్ విగ్రహాన్ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరిస్తారు.

Also REad: రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News