Monday, September 15, 2025

మేడారంపై చిల్లర రాజకీయాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: వచ్చే సంవత్సరం 2026 మేడారం మహా జాతరకు అటవీ మార్గాల ద్వారా నూతన రోడ్లు ఏ ర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయితీ రాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. మేడారం మహా జాతరకు అటవీ ప్రాంతం నుండి వచ్చే భక్తుల కోసం కాల్వప ల్లి, బయ్యక్క పేట, కొండపర్తి, గోనేపల్లి మార్గాలను ఆదివారం రాష్ట్ర పంచాయితీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క జిల్లా ఎస్పీ డాక్ట ర్ శబరీష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొండపర్తి నుండి గోనేపల్లి మీదుగా ఆర్టీసి బస్టాండ్ వరకు నూతన రోడ్డును, గోవిందరావుపేట మండలం ముత్తాపూర్ నుం డి గోనేపల్లి మీదుగా కొంగల మడు గు వరకు భక్తులు, ఎడ్ల బండ్ల మీద వచ్చే భక్తులకు సౌకర్యార్ధం, కాల్వపల్లి, బయ్యక్క పేట నుండి వచ్చే భ క్తులకు కన్నెపల్లి రోడ్డు ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ మేడారం మహా జాతరకు భ క్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున మేడారం పరిసరాలలోని అటవీ ప్రాంతంలోనే జా తరకు వచ్చే వాహనాల పార్కింగ్ చే సేలా చర్యలు తీసుకుంటున్నట్లు తె లిపారు. కాల్వపల్లి నుండి ఊ రట్టం వరకు నూతనంగా బిటి రోడ్డును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఎక్కువగా నూతన మార్గాల ఏర్పాటు వల్ల వెంగళాపూర్, నార్లాపూర్ మీదుగా రద్ధి లేకుండా పస్రానుండి నార్లాపూర్ వరకు వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులకు సులువు మార్గాల ద్వారా జాతరకు చేరుకునే విధంగా నూతన మార్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అటవీ దారులను అభివృద్ధి చేసుకుని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు, మేడారం మహా జాతరలోపు రూ. 16.5 కోట్లతో కొండాయి బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. సమ్మక్క, సారలమ్మ వనదేవతల కీర్తిని మరింత పెంచే విధంగా యజ్ఞంలా అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. కొంతమంది తమ ప్రయోజనాల కోసం దేవుని దగ్గర చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. భక్తులు దుష్ప్రచారాలను నమ్మవద్దని, ఆదివాసీ సంప్రదాయాలకు భంగం వాటిల్ల కుండా పనులు చేయించే బాధ్యత తనపై ఉందన్నారు. సమ్మక్క, సారలమ్మ కీర్తి ఇనుమడింపచేసే విధంగా మేడారం ఆధునీకరణ పనులు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పీ నలువాల రవిందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అర్రెం లచ్చు పటేల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also REad: యూరియా కోసం క్యూలైన్‌లో సత్యవతి రాథోడ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News