మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపొందినట్టే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించి అధిష్టానానికి కానుకగా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ నాయకులకు, కా ర్యకర్తలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మె ల్సీ బి.మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి సు ధాకర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, అభ్య ర్థి ఎంపికను అధిష్టానం చూసుకుంటుందని చెప్పా రు.
అయితే గెలిపించే బాధ్యతను మనం అందర మూ తీసుకోవాలన్నారు. భారీ మెజారిటీతో అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయన సూచించారు. దీనికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయం తో ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా పోలిం గ్ కేంద్రం వరకూ కమిటీలు, కార్యకర్తలు బాధ్యతతో పని చేయాలన్నారు. దీనిని పార్టీ నాయకులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. మీకు ఏదైనా అనుమానం, సందేహాలు, సమస్యలు వస్తే వెంటనే సంబంధిత మంత్రులను సంప్రదించాల ని, ఇంకా అవసరమైతే తననూ కలవవచ్చని అన్నా రు. ప్రభుత్వం చేపట్టిన, ఇంకా చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యతను తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటికీ కార్యకర్తలు వెళ్ళాలని, గ్రూపు మీటింగ్‌లు నిర్వహించుకోవాలని, అపార్ట్‌మెంట్స్‌ల వారీగా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
నెలాఖరులోగా నోటిఫికేషన్..
ఇదిలాఉండగా ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గం గెలుపొందడం ద్వారా ప్రభుత్వ పని తీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్న సంకేతాలను రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా పంపించేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది నేతలు పోటీ పడడం సంతోషకరమేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సాంప్రదాయమేనని ఆయన తెలిపారు. అయితే అభ్యర్థి ఎంపిక మన చేతిలో లేదని, దీనిని అధిష్టానమే చూసుకుంటుందన్నారు. ఎంత మంది పోటీకి ఉత్సాహపడినా, అభ్యర్థి ఖరారైన తర్వాత మాత్రం అందరూ సమిష్టిగా పని చేసి అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయన సూచించారు. టిక్కెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడరాదని, వారి సేవలను పార్టీ నాయకత్వం మరో రూపంలో వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఇంకా ఈ సమావేశంలో జిహెచ్‌ఎంసి మేయర్ జి. విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పోరేషన్ల చైర్మన్లు బెల్లయ్య నాయక్, శోభా రాణి, వివిధ డివిజన్లకు ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న కార్పోరేషన్ల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.
Also Read: రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు