Monday, September 15, 2025

హైదరాబాద్‌లో కుండపోత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల లో వర్షం దంచికొట్టింది. ఆదివారం సాయంత్రం నుంచి భారీ వ ర్షం కురిసింది. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలలో లోతట్టు ప్రాం తాలు, రహదారులు జలమయమయ్యాయి. హై టెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏ ర్పడింది. గచ్చిబౌలి పరిధి వట్టినాగులపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చో టు చేసుకుంది. భారీ వర్షానికి వ ట్టినాగులపల్లిలో ఓ ఇంటి గోడ కూలిం ది. ఇద్ద రు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పు రాతన ఇళ్లలో ఉంటున్న వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హె చ్చరికలు జారీ చేశారు. భారీ వర్షం ధాటికి హబీబ్‌నగర్‌లోని అఫ్జల్ సాగర్‌లోని మంగారు బస్తీలో ఇద్దరు గల్లంతయ్యారు. నాలాలో మామా, అల్లు డు కొట్టుకుపోయారు. నాలాను దాటే క్రమంలో అదుపు తప్పి నాలాలో పడిపోయినట్లు నిర్ధారించారు. వీరిద్దరి ఆచూకీ కోసం పోలీసుల గాలిం పు చర్యలు చేపట్టారు. మరోవైపు ముషీరాబాద్‌లో

ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. మియాపూర్, కూకట్‌పల్లి, షేక్‌పేట, రాయదుర్గం, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, హి మాయత్‌నగర్, రామ్‌నగర్, ముషీరాబాద్, ఎల్బీనగర్, తార్నాక, కాచిగూడ, అల్వాల్, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, కాప్రా, ఉప్పల్, టోలీచౌకి, శేరిలింగంపల్లి, కీసర తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వర్షం నీటితో వాహ న చోదకుల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. బంజారాహిల్స్‌లో జలమయమైన రహదారులను అధికారులతో కలిసి జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మీ పరిశీలించారు. మియాపూర్, మదీనాగూడ మార్గంలో జాతీయ రహడారిపై వరదనీరు చేరింది. సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా కుండపోత వర్షం కురిసింది. కవాడీగూడ పద్మశాలీ కాలనీలో ఇళ్లల్లోకి నీరు చేరింది. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోవడంతో హైడ్రా, జిహెచ్‌ఎంసి సిబ్బంది రంగంలోకి దిగారు.

రోడ్లపై నిలచిన నీటిని తొలగించారు. ఆర్‌ఆర్‌జిల్లా గడ్డి అన్నారంలో గరిష్టంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాం తంలో 12 సెం.మీ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 10 సెం.మీ, అడిక్‌మెట్‌లో 9 సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 7 సెం.మీ, మల్కాజ్‌గిరిలో 6 సెం.మీ, ఉప్పల్‌లో 7 సెం.మీ, అల్వాల్‌లో 7 సెం.మీ, గండిపేట 7 సెం.మీ, బండ్లగూడలో 5 సెం.మీ, నాంపల్లిలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

Also Read:  పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News