మీనాక్షి హుడా, జైస్మిన్ లాంబోరియాలకు పతకాలు
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు
న్యూఢిల్లీ: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో భారత్ రెండు స్వర్ణాలు లభించాయి. జైస్మిన్ లాంబోరియా, మీనాక్షిహుడా విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షిహుడా 4-1 తేడాతో కజకిస్థాన్ బాక్సర్ సజీమ్ కైజెయిబెపై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచి వ్యూహాత్మకంగా ఆడిన మీనాక్షి ప్రత్యర్థిపై వరుస పంచ్‌లతో ఆధిపత్యం చెలాయించింది. బ్యాక్‌ఫుట్‌పై ఉంటూ ప్రత్యర్థిపై దాడికి దిగింది. బలమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి పంచ్‌లను ఎదుర్కొని విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఈ బౌట్‌లో తన ఎత్తును అడ్వాంటేజ్‌గా మార్చుకుంది మీనాక్షిహుడా. మరో పోరులో మహిళల 57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియా 4-1 గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. ఇక మెన్స్ విభాగంలో ఈసారి భారత్‌కు ఒక్క పతకం రాలేదు. 2013 తర్వాత పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం కూడా సాధించకపోవడం ఇదేతొలిసారి. భారత స్టార్ బాక్సర్, తెలుగు తేజం నిఖత్ జరీన్ పోరాటం మాత్రం క్వార్టర్స్‌లోనే ముగిసింది. భారీ అంచనాలతో బరిలోకిదిగిన ఈ మాజీ ఛాంపియన్ క్వార్టర్ ఫైనల్లో 0-5తో బ్యూస్ నాజ్ కకిరోగ్లు (తుర్కియే) చేతిలో చిత్తయింది.