- Advertisement -
ములుగు: కుటుంబంతో మేడారం వెళ్లి వస్తున్న భక్తుడిపై ఎస్ఐ దాడి చేశాడు. ఈ సంఘటన ములుగు జిల్లా పస్రా పోలీస్ స్టేషన్ పరిధిలోజరిగింది. కుటుంబ సభ్యులతో మేడారం వెళ్లి తిరిగి వస్తుండగా ఎస్ఐ వారి వాహనాన్ని ఆపారు. సదరు వ్యక్తిపై ఎస్ఐ పుట్ట సతీష్ దాడి చేశాడు. మహిళలు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా ఎస్ ఐ కనికరించకుడా వ్యక్తి చెంపపై కొట్టాడు. ఆ కుటుంబంలోని వ్యక్తులు ఎస్ఐ ఆపడానికి ప్రయత్నించారు. వారిని కూడా పక్కకు నెట్టేశాడు. సామాన్యులపై పోలీసుల ప్రతాపం కాదు క్రిమినల్స్ పై చూపించాలని నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?
- Advertisement -