Monday, September 15, 2025

భాగ్యనగరంలో భారీ వర్షం… ముగ్గురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయంగా మారాయి. గంట వ్యవధిలోనే దాదాపు 12 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాలలో లోతట్టు ప్రాం తాలు, రహదారులు జలమయమయ్యాయి. వీధుల్లో వరదలు పోటెత్తాయి. ముగ్గురు యువకులు వరదల్లో గల్లంతయ్యారు.  ఆసిఫ్ నగర్ ప్రాంతం హబీబ్ నగర్‌లో మామ, అల్లుడ్లు వరదలో కొట్టుకుపోయారు.   ముషీరాబాద్ ప్రాంతం వినోద నగర్‌లో పిట్టగొడపై సన్నీ అనే యువకుడు కూర్చొని స్నేహితులతో మాట్లాడతున్నాడు. గోడ కూలిపోవడంతో సన్నీ నాలాలో పడి కొట్టుకుపోయాడు. స్థానికులు కాపాడడానికి ప్రయత్నించాడు. అప్పటికే వరద ఎక్కువగా ఉండడంతో గల్లంతయ్యాడు. వెంటనే పోలీసులు సిబ్బందికి సమాచారం ఇచ్చారు. జిహెచ్ఎంసి, హైడ్రా, పోలీసులు గల్లంతైన వారి గాలింపు చర్యలు చేపట్టారు.

Hyderabad Heavy rains

Also Read:  నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)

హైటెక్ సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏ ర్పడింది. గచ్చిబౌలి పరిధి వట్టినాగులపల్లిలో తీవ్ర విషాదకర ఘటన చో టు చేసుకుంది. భారీ వర్షానికి వ ట్టినాగులపల్లిలో ఓ ఇంటి గోడ కూలిం ది. ఇద్ద రు మృతిచెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మియాపూర్, కూకట్‌పల్లి, షేక్‌పేట, రాయదుర్గం, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, హి మాయత్‌నగర్, రామ్‌నగర్, ముషీరాబాద్, ఎల్బీనగర్, తార్నాక, కాచిగూడ, అల్వాల్, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, కాప్రా, ఉప్పల్, టోలీచౌకి, శేరిలింగంపల్లి, కీసర తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వర్షం నీటితో వాహ న చోదకుల రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది.

ఆర్‌ఆర్‌జిల్లా గడ్డి అన్నారంలో గరిష్టంగా 12 సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాం తంలో 12 సెం.మీ, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 10 సెం.మీ, అడిక్‌మెట్‌లో 9 సెం.మీ, హిమాయత్‌నగర్‌లో 7 సెం.మీ, మల్కాజ్‌గిరిలో 6 సెం.మీ, ఉప్పల్‌లో 7 సెం.మీ, అల్వాల్‌లో 7 సెం.మీ, గండిపేట 7 సెం.మీ, బండ్లగూడలో 5 సెం.మీ, నాంపల్లిలో 5 సెం.మీ వర్షపాతం నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News