Monday, September 15, 2025

కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి?: బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్ఎస్ మాజీ సిఎం కెసిఆర్ పదేళ్ల పాలనలో రూ. వేల కోట్ల బకాయిలు పెట్టారని బిజెపి కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడం దుర్మార్గం అని అన్నారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో బండి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలన వచ్చినా పరిస్థితి మారలేదని, కాలేజీలకు టోకెన్లు టైంపాస్ చేస్తున్నారని విమర్శించారు. కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని బండిసంజయ్ మండిపడ్డారు.

Also Read : మేడారంపై చిల్లర రాజకీయాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News