అమరావతి: సామాజిక న్యాయాన్ని పరిగణిస్తూ సమర్థతకు పెద్దపీట వేస్తున్నామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచంలోనే తెలుగు వాళ్లు అగ్రస్థానంలో ఉండాలనేదే తన ఆలోచన అని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ గ్రోత్ అని 15 శాతం వృద్ధిరేటు సాధించగలగాలని తెలియజేశారు. తలసరి ఆదాయం పెంచేలా కృషి చేయాలని, ఈ ప్రభుత్వం రాగానే నిర్దిష్టమైన విధానం వికసిత్ భారత్ 2047 తయారు చేసిందని పేర్కొన్నారు.
మనం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 తయారు చేశామని, ఇంతకు ముందంతా హార్డ్ వర్క్ ఇప్పుడు స్మార్ట్ వర్క్ చేయాలని అధికారులకు సూచించారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పి4 తీసుకొచ్చామని, అభివృద్ధి చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఎకో సిస్టమ్ తయారు చేయాలని, భారత్ ప్రథమ స్థానంలో నిలవాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా వచ్చాక 11 వ ఆర్థిక వ్యవస్థ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారైందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Also Read : గుండెకు డబుల్ ఆపరేషన్