Tuesday, September 16, 2025

మంగళవారం రాశి ఫలాలు (16-09-2025)

- Advertisement -
- Advertisement -

మేషం –  మీ స్థాయి పరపతి పెంపొందుతాయి. ఎలర్జీ వంటి ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు చేస్తారు. అప్రమత్తంగా ఉండండం చెప్పదగిన సూచన.

వృషభం – ఆర్థికపరమైన లాభాలను పూర్తిస్థాయిలో అందుకోవడానికి గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వివాదాస్పదమైన అంశాలను మరింత జటిలం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు.

మిథునం – చాలా విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడుల పైన ప్రధానంగా దృష్టిని సారిస్తారు. స్థిరాస్తులను వృద్ధి చేయాలనే ఆలోచనలు మరింతగా బలపడతాయి.

కర్కాటకం – జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు చోటు చేసుకుంటాయి. చిన్నపాటి ఒడిదుడుకులను అధిగమించి కార్యక్రమాల్ని  విజయ పథంలో నడిపించగలుగుతారు.

సింహం – ఆర్థికపరమైన అంశాలలో చాలా మెలకువగా వ్యవహరిస్తారు. ఒకప్పటి రాజకీయ మిత్రులతో తిరిగి సఖ్యత ఏర్పడుతుంది. వెన్నునొప్పి భావిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది.

కన్య –  మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కారణం ఉంటుంది. కనుక అధిక ధన వ్యయాన్ని లెక్కబెట్టరు. మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు.

తుల – మీ నడవడిక సూటిగా ఉంటుంది. చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. అనుకూలమైన బదిలీ లేక ప్రమోషన్ లభించే సూచనలు ఉన్నాయి.

వృశ్చికం –  మిత్రత్వాలు మరింతగా బలపడతాయి. దురభ్యాసాలకు దూరంగా ఉండటం చెప్పుదగినది. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. మానసిక  సంత్రుప్తి లభిస్తుంది.

ధనుస్సు – మీ వ్యక్తిత్వం పలువురి ప్రశంసలను అందుకుంటుంది. లలిత కళలలో ప్రావీణ్యం పొందిన వారికి గొప్ప అవకాశాలు కలిసి వస్తాయి. దూరప్రాంత ప్రయాణాలు లాభసాటిగా పరిణమిస్తాయి.

మకరం – రుణాలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా పరిష్కరించుకోవడానికి గాను సమాయత్తమవుతారు. రాజకీయ, కళా రంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందగలుగుతారు.

కుంభం – కొన్ని విషయాలలో హుందాగా వ్యవహరిస్తారు. పరుష సంభాషణలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలు పరంగా అభివృద్ధి ఆశించిన స్థాయిలో ఉండకపోవడం ఆలోచింపచేస్తుంది.

మీనం – దూరప్రాంతాల నుండి అనుకూలమైన శుభ సమాచారాన్ని అందుకోగలుగుతారు. స్పెక్యులేషన్ వలన నష్టపోకుండా జాగ్రత్త పడటమే మీకు పరోక్షమైన లాభంగా పరిణమిస్తుంది.

Weekly rasi phalalu next week

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News