కన్నడ సూపర్‌స్టార్ హీరో ఉపేంద్రకు (Upendra) ఊహించని సమస్య ఎదురైంది. ఆయన ఫోన్ హ్యాకింగ్‌కి గురైంది. దీంతో తన ఫోన్ నుంచి కాల్స్‌ని ఎవరూ లిఫ్ట్ చేయవద్దని.. తన భార్య ఫోన్ నుంచి కూడా కాల్ చేసి డబ్బులు అడిగితే ఎవరూ పంపవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోషల్‌మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఆయన పేర్కొన్నారు.
తన భార్య ప్రియాంక ఆర్డర్ చేసిన వస్తువుకు సంబంధించి సోమవారం ఉదయం ఒకరు కాల్ చేశారని.. ఏవో హ్యాష్‌ట్యాగ్ నెంబర్లు ఎంటర్ చేస్తే.. ఆ వస్తువు డెలివరీ అవుతుందని చెప్పారని ఆయన (Upendra) వీడియోలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఫోన్ హ్యాక్ అయిందని తెలిపారు. కాబట్టి తన నుంచి ఎలాంటి కాల్స్ వచ్చిన స్పందించ వద్దని అన్నారు. ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అభిమానులకు సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read : నటి కాకపోతే.. స్టైలిస్ట్ లేదా మోడల్ అయ్యేదాన్ని