Monday, September 15, 2025

రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం: హరీశ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆర్ఆర్ఆర్ కోసం అలైన్ మెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన మారుస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రైతులు భూములు కోల్పోకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. అలైన్ మెంట్ మార్చి పేద రైతుల పొట్ట కొట్టడం దుర్మార్గమని, కాంగ్రెస్ అనాలోచిత చర్యల వల్ల రైతులు భూములు కోల్పోయే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి సొంత భూములకు మేలు కలిగేలా అలైన్ మెంట్ మార్చడం దుర్మార్గం అని మండిపడడ్డారు. అలైన్ మెంట్ మార్పుతో కేంద్రం ఆర్ఆర్ఆర్ ను తిరస్కరించే పరిస్థితి ఏర్పడిందని, సమస్య పరిష్కరించే వరకు బిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హరీశ్ రావు సవాల్ విసిరారు.

Also Read : ఆ విద్యార్థుల విద్యకు దెబ్బ కొడుతున్నారు: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News