Monday, September 15, 2025

హాంకాంగ్‌తో మ్యాచ్‌.. బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక (Srilanka) 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అదే జోరుతో హాంగ్‌కాంగ్‌పై కూడా విజయం సాధించాలని శ్రీలంక జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ జట్టుతో ఓటమిని ఎదురుకున్న హాంగ్‌కాంగ్ జట్టు ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది.

తుది జట్లు:

శ్రీలంక(Srilanka): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), కమిల్ మిషార, కుసల్ పెరీరా, చరిత్ అసలంక(కెప్టెన్), కమిందు మెండిస్, దసున్ షనక, వనిందు హసరంగా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, నువాన్ తుషార.

హాంగ్‌కాంగ్: జీషన్ అలీ(కీపర్), అన్షుమన్ రాత్, బాబర్ హయత్, నిజాకత్ ఖాన్, షాహిద్ వాసిఫ్, కించిత్ షా, యాసిమ్ ముర్తాజా(కెప్టెన్), ఐజాజ్ ఖాన్, ఆయుష్ శుక్లా, ఎహ్సాన్ ఖాన్, అతీక్ ఇక్బాల్.

Also Read : పాక్‌పై ఘన విజయం.. అభిషేక్ నయా రికార్డు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News