- Advertisement -
మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో మురుగు కాలువలో సుమారు ఐదు నెలల గర్భస్థ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నెలలు నిండని ఆ పసికందును మురుగు కాలువలో పడేసిన తీరు మాతృత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉందని వాపోయారు. ఈ ఘటన చూసి మానవత్వం మంటకలిసిందని వ్యాఖ్యానించారు. అయితే, పసికందు మృతదేహాన్ని ఎవరు తెచ్చారు..ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది.
Also Read:ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు
- Advertisement -