- Advertisement -
మన తెలంగాణ/చొప్పదండి: కరీంనగర్ కమిషనరేట్లో హోంగార్డుగా పనిచేస్తున్న ముద్దసాని కనుకయ్య (46) పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే…చొప్పదండి మండలం, రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనుకయ్య ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమితం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించే క్రమంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -