- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణిస్తుండడంతో ప్రసిద్ధ ఎర్రకోటకు వేగంగా నష్టం కలుగుతోందని ఇటీవలి అధ్యయనం కనుగొంది. 17వ శతాబ్దపు స్మారక చిహ్నం ఎర్ర ఇసుకరాయి గోడలపై నల్లటి కాలుష్య కారకాలు ఏర్పడుతున్నాయని, ఇది దాని నిర్మాణ, సౌందర్య సమగ్రతను దెబ్బతీసేదిగా ఉందని ఇండోఇటాలియన్ నూతన అధ్యయనం పేర్కొంది. చారిత్రక స్మారకం అయిన ఎర్రకోటను 16391648 మధ్య కాలంలో మొగలు చక్రవర్తి షాజహాన్ కట్టించారు.
నల్లటి కాలుష్య కారకాలలో జిప్సమ్, బాస్సనైట్, వెడ్డెలైట్, లెడ్, జింక్, క్రోమియం, కాపర్ వంటివి ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. వాహన, సిమెంట్ కర్మాగార ఉద్గారాలు, నగరంలో నిర్మాణ కార్యకలాపాల వల్ల ఎర్రకోటకు కాలుష్య బెడద ఏర్పడుతోందని అవగతం అవుతోంది. ఢిల్లీలోని ఎర్రకోట నేడు తీవ్ర కాలుష్య ముప్పును ఎదుర్కొంటోందని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది.
- Advertisement -