Tuesday, September 16, 2025

ముగిసిన హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2025

- Advertisement -
- Advertisement -

హెల్త్ ఆర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్‌డబ్ల్యుఈ సెర్చ్ అండ్ హెల్త్ ఇన్నోవేషన్ సమ్మిట్ -2025 సోమవారం ముగిసింది. హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మిట్‌లో 13 దేశాల నుండి 2,800 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. 62 మంది ప్రముఖులు, 42 అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులు పాల్గొని ఆరోగ్యరంగంలో వాస్తవ ప్రపంచ సాక్ష్యాలు, కృత్రిమ మేధస్సు, డిజిటల్ హెల్త్, ఇన్నోవేషన్ పై చర్చలు జరిపారు. ఈ సమ్మిట్‌ను రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఇండస్ట్రీస్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యరంగం, లైఫ్ సైన్సెస్ విప్లవాత్మక మార్పులకు లోనవుతున్న ఈ సమయంలో ఇలాంటి వేదిక అత్యంత సమయోచితమైందన్నారు. గ్లోబల్ నిపుణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చిన హెల్త్ ఆర్క్ బృందం అభినందనీయమని పేర్కొన్నారు.

మాజీ భారత శాశ్వత ప్రతినిధి, ప్రస్తుత కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ డీన్ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ఔషధరంగం, లైఫ్‌సైన్సెస్ రంగాల అగ్రనేతలతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రసంగించారు. ఆయన ప్రస్తుత జియోపాలిటికల్ క్లిష్ట పరిస్థితులు, వాటి వ్యాపార ప్రభావం పై ప్రసంగిస్తూ మారుతున్న ప్రపంచ సమీకరణలు రంగంపై చూపుతున్న అవకాశాలు, సవాళ్లను విశ్లేషించారు. స్విట్జర్లాండ్ మాజీ అసెంబ్లీ సభ్యులు ఆదిత్య ఎల్లిపెద్ది గ్లోబల్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌లో భారత జీసీసీల పాత్ర పై ప్రసంగించారు. భారత గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేశారు. సమ్మిట్‌లో ముఖ్యమైన జీసీసీల్లో లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల చర్చల్లో అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ ప్యానెల్‌లో మోహిన్ హింగ్రా, నిలయ్ శాస్త్రి, మహేష్ నటరాజన్ తదితరులు ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వల్ల గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు ఎలా మారుతున్నాయో వివరించారు.

ఇవి కేవలం ఆపరేషనల్ సామర్థ్యాలకే కాకుండా ఆర్‌అండ్‌డి క్లినికల్ ట్రయల్స్, పేషెంట్ అవుట్‌కమ్స్‌లో ఇన్నోవేషన్‌ను ముందుకు తీసుకెళుతున్నాయని, హెడ్ కౌంట్ ఆధారిత మోడల్స్ నుండి నాలెడ్జ్-డ్రైవన్, ఇంపాక్ ్ట-డ్రైవన్ గ్రోత్ వైపు మార్పు స్పష్టమవుతోందని ప్యానెల్ అభిప్రాయపడ్డారు. హెల్త్ ఆర్క్ సిఈఓ డాక్టర్ పురవ్ గాంధీ, హెల్త్ ఆర్క్ కో ఫౌండర్ సుదీప్ కృష్ణ నాయకత్వంలో జానక్ జోషి, జూలీ క్రోమెన్‌హోక్ సహాధ్యక్షులుగా 25 ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. వీటిలో ఆర్‌డబ్లుఈ వినియోగం, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్, ఏఐ ఆధారిత క్లినికల్ రీసెర్చ్, డీసెంట్రలైజ్డ్ ట్రయల్స్ వంటి అంశాలపై చర్చలు జరిగాయి. సమ్మిట్‌లో నిపుణులు ఏఐ, ఆర్‌డబ్లుఈ వల్ల క్లినికల్ ట్రయల్స్ వేగవంతమవుతున్నాయని, డేటా నాణ్యత మెరుగుపడుతోందని, పేషెంట్ రిక్రూట్‌మెంట్ సమర్థవంతంగా జరుగుతోందని చెప్పారు. అలాగే డేటా బయాస్, ఇంటరాపరబిలిటీ, రెగ్యులేటరీ కంప్లయెన్స్ వంటి సవాళ్లను అధిగమించాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు. మూడు రోజుల చర్చల అనంతరం భారత్ గ్లోబల్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ హబ్‌గా ఎదుగుతోందని స్పష్టమైంది. టెక్నాలజీ, డేటా, మల్టీడిసిప్లినరీ సహకారం ద్వారానే పేషెంట్-సెంట్రిక్ కేర్ సాధ్యమని ఈ సమ్మిట్ మరోసారి నిరూపించింది.

Also Read: సినిమాల చిత్రీకరణ మరింత సులభతరం: దిల్ రాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News