అబుదాబి: ఆసియాకప్‌లో భాగంగా సోమవారం ఒమన్‌తో జరిగిన గ్రూప్‌ఎ మ్యాచ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో యుఎఇకి ఇదే తొలి విజయం కావడం విశేషం. ఇక ఒమన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన యుఎఇ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 172 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఓపెనర్లు అలీషాన్ షరాఫు, మహ్మద్ వసీం అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఇద్దరు ఒమన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన అలీషాన్ షరాఫు 38 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన వసీం 54 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో 69 పరుగులు సాధించాడు.
మహ్మద్ జోహెబ్ (21), హర్షిత్ కౌశిక్ (19) నాటౌట్ తమవంతు పాత్ర పోషించారు. తర్వాత లక్షఛేదనకు దిగిన ఒమన్ 18.4 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ జతిందర్ సింగ్ (20) పరుగులు చేసి ఔటయ్యాడు. ఆర్యన్ బ్రిస్త్ (24), వినాయక్ శుక్లా (20), జితేన్ రామనంది (13), షకీల్ అహ్మద్ 14(నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. యుఎఇ బౌలర్లలో జునేద్ నాలుగు, జవాదుల్లా, హైదర్ అలీ చెరో రెండు వికెట్లను పడగొట్టారు.