Tuesday, September 16, 2025

వంతరాపై సుప్రీం కోర్టు క్లీన్‌చిట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : గుజరాత్ లోని జామ్‌నగర్‌లో జులాజికల్ రిస్కు, రీహేబిలిటేషన్ (వన్యమృగ ప్రమాద నివారణ, పునరావాస ) కేంద్రం వంతరాపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్ ఇచ్చినట్టు సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. ఈ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం విచారించింది. వంతరాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ విషయంపై వివరణాత్మఖ ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.

వంతరాలో చట్టాలను పాటించట్లేదని, విదేశాలు, వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకు వస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సుప్రీం కోర్టు సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై సుప్రీం కోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ ఈనెల 12న నివేదిక సమర్పించింది. సీ. ఆర్. జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ అస్పష్టమైనదిగా పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News