Tuesday, September 16, 2025

కేరళలో ప్రాణాంతక అమీబా.. మెదడు కణాలు తినేసే రకం.. 18మంది మృతి

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం ః కేరళలో మనిషి మెదడు కణాలను తినేసే ప్రాణాంతక సూక్ష్మజీవి అమీబా విరుచుకుపడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమీబా బాధిత కేసులు 67 వరకూ అధికారికంగా వెలుగులోకి వచ్చాయి, ఈ ఏడాది ఇప్పటికే 18 మంది వరకూ ఈ సూక్ష్మజీవుల కాటుతో మృతి చెందారు. సవరించిన లెక్కలను ఇప్పుడు సోమవారం అధికారికంగా మీడియాకు వెలువరించారు. సంబంధిత కేసులు పెరిగిపోతూ ఉండటంతో పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి స్పందించారు.

అత్యవసర రీతిలో మంచినీటి భద్రత, ఇతరత్రా వైద్యపరమైన చర్యకు ఆదేశించారు. సాధారణంగా ఈ అమీబియా మనిషిని నీటి ద్వారా కబళిస్తుంది. కలుషిత నీరు తాగినా, దీనితో స్నానాలు చేసినా ఇది మనిషి మెదడులోకి చేరుకొంటోంది. కణాలను దెబ్బతీస్తుందని వెల్లడైంది. కొన్నికేసులలో ఇది ముదిరి ప్రాణాంతకం అవుతోంది. శాస్త్రీయంగా ఈ బ్యాక్టీరియాను అమీబియాక్ మెనిన్‌గోఎన్‌సెఫాలిటిస్ కేసుగా వ్యవహరిస్తారు. తిరువనంతపురంలో ఓ 17 సంవత్సరాల బాబుకు ఈ బ్యాక్టీరియా సోకింది. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే యాత్రికులు దీని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత కేసులతో అక్కులం టూరిస్ట్ గ్రామం వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ వెంటనే సందర్శకులు రాకుండా మూసివేయించింది. ఈ స్విమ్మింగ్ పూల్‌లోనే జలకాలాడిన బాలుడికి ఈ అమీబియా సోకిందని నిర్థారణ అయింది. దీనితో ఇక్కడి జలాల నమూనాలను పరీక్షలకు పంపించారు. ప్రజలు నిలువ ఉండే లేదాద కలుషిత నీటి కొలనులలోకి దిగరాదని, తలస్నానాలకు దిగరాదని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి సూచించారు. అధికార యంత్రాంగం వెంటనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణంగా ఈ బ్యాక్టీరియా ముక్కు ద్వారా లేదా తల నుంచి లోపలికి చేరుతోంది. కోజికోడ్ వైద్య కళాశాల ఆసుపత్రిలో ఇప్పటికే ఈ బ్యాక్టీరియాతో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. దీనితో పలు ప్రాంతాలలో ఈ బ్యాక్టీరియాపై ఆందోళన నెలకొంది.

Also Read: ఆ ప్రాంతంలో నక్సలిజం అంతమైంది: అమిత్ షా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News