Tuesday, September 16, 2025

మోడీ పర్యటనతో మణిపూర్ గాయం మానేనా?

- Advertisement -
- Advertisement -

ఒకప్పుడు భారతదేశ ఈశాన్య సరిహద్దుల్లో జాతు గుర్తింపుల శక్తివంతమైన సముదాయంగాఉన్న మణిపూర్, ఇప్పుడు శాశ్వత విభజనకు చిహ్నంగా మారింది. 2023 మే 3న లోయలో నివసించే మెయితీ మెజారిటీ కమ్యూనిటీ, కొండ ఆధారిత కుకి-జో తెగల మధ్య జాతిపరమైన హింస చెలరేగినప్పటి నుంచీ రాష్ట్రంలో 258 మందికి పైగా మరణించారు. 60,000 మంది నిరాశ్రయులయ్యారు. జాతిపరంగా, అనధికారికంగా స్పష్టమైన విభజనను చూసింది. రెండున్నర సంవత్సరాల తర్వాత, అంటే.. ఘర్షణలు ప్రారంభమైన 865 రోజుల తర్వాత, 2025 సెప్టెంబర్ 13న ప్రధాని నరేంద్ర మోడీ తన దీర్ఘకాలిక పర్యటనకు సిద్ధమైనప్పుడు ఆ గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఐక్యత సాధించాలన్న ఆశలు కలగానే ఉన్నాయి. మెయితీ, కుకీ కమ్యూనిటీలు రెండూ కేంద్రంలోని, రాష్ట్ర స్థాయిలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాల పట్ల పూర్తి విశ్వాసం కోల్పోయాయి. విరిగిన మనసులను అతికించే వైద్యులుగా కాక, సంక్షోభాన్ని సృష్టించిన రూపశిల్పులుగానే చూస్తున్నాయి.

మానవ హక్కుల సంస్థలు, ప్రభుత్వ డేటా, కమ్యూనిటీలు మాట్లాడే దానిని బట్టి చూస్తే, విభజన బీటలుగా మారింది. జోక్యం ఆలస్యమైంది. ప్రభుత్వ విధానం ఉద్రిక్తతలు అనే నిప్పురవ్వలను ఎగదోసి ఏగిసిన మంటలుగా మార్చింది. చివరిగా, ఇది తాత్కాలికంగా అయినా పునర్నిర్మాణానికి ఒక మార్గాన్ని సూచిస్తున్నది. శూన్యంనుంచి హింస చెలరేగలేదు. ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం (2017- 2025) హయాంలో భద్రత, అభివృద్ధి ముసుగులో కొండ ప్రాంతాలను, ముఖ్యంగా కుకీలను లక్ష్యంగా చేసుకుని వరుసగా చర్యలకు పాల్పడింది. ఆనాటి ప్రభుత్వ చర్యలు జాతుల మధ్య ఉద్రిక్తత వాతావరణాన్ని ఎలా పెంచి పోషించాయో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవ హక్కుల సంస్థలతో సహా విమర్శకులు తేటతెల్లం చేశారు.

2024 ఫిబ్రవరిలో, మణిపూర్, చురాచంద్‌పూర్ వంటి కుకీ ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ఆ కమ్యూనిటీపట్ల వివక్ష, తొలగింపు కార్యక్రమం ప్రారంభమైంది. అటవీప్రాంతాల్లో నివసించే గిరిజనులను ఆక్రమణదారులుగా ముద్రవేసింది. దీనిని గిరిజన వ్యతిరేకిగా, కుటుంబాలను నిర్వాసితులుగా, విభేదాలు రేకెత్తించేదిగా భావన మొదలైంది. మణిపూర్ హైకోర్టు 2023 మార్చిలో మెయితీలకు షెడ్యూల్డ్ తెగ (ఎస్‌టి) హోదా మంజూరు చేయాలని సిఫార్సు చేయడం, గిరిజనులకు రిజర్వు చేసిన కొండభూములను వారికి అందుబాటులోకి తీసుకు రావడం, మే 3న భారీ ఎత్తున కుకీల నిరసనలకు, తర్వాత ఘర్షణలకు దారితీసింది. 2018లో బీరేన్ సింగ్ సర్కార్ ప్రారంభించిన మాదకద్రవ్యాలపై యుద్ధం- కుకీలను మరింత దూరం చేసింది. కొండప్రాంతాలలో గసగసాల సాగును లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించినప్పటికీ, అది జాతి ప్రక్షాళనకు ఓ పరికరంగా ఉపయోగపడిందనే ఆరోపణ ఉంది. సింగ్ బహిరంగంగానే కుకీలను నార్కో టెర్రరిస్ట్‌లుగా- ముద్రవేసి, వారిని మయన్మార్ శరణార్థులతో జతకట్టారు. మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌లో మెయితీలతో సహా అన్ని కమ్యూనిటీలకు విస్తరించి ఉన్నాయనే ఆధారాలను విస్మరించింది. కుకీ, నాగ కొండలలో సరిహద్దు ప్రాంతాలలో గసగసాల పొలాలు వృద్ధి చెందుతాయి.

కానీ, అక్రమ రవాణాలో మెయితీలు, ముస్లింలు (ఫంగల్లు) లోయనుంచి నేపాలీలు పాల్గొంటారు. 2017- 2023 నుండి అరెస్ట్టు చేసిన వారి డేటా ప్రకారం 1,083 మంది పంగల్లు (లోయ ముస్లింలు) ను అదుపులోకి తీసుకున్నారు. సమూహాలలో వాణిజ్యం బహుళ జాతులు ఉన్నాయి. అయినా కుకీలనే బలి పశువులను చేసింది. దీంతో అవిశ్వాసం మరింత పెరిగింది. ఈ చర్యకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు స్పష్టంగా ఉన్నాయి. మొదట్లో లక్ష మంది కంటే ఎక్కువమంది సైనికులను మోహరించినప్పటికీ, బిజెపి అంతర్గత తిరుగుబాటు 2025 ఫిబ్రవరిలో బీరేన్ సింగ్ రాజీనామా చేసి, రాష్ట్రపతి పాలన విధించే వరకూ ఆయనను సమర్థించింది. కుకీ మహిళలపై దాడికి సంబంధించి వీడియో 2023 జులైలో వైరల్ అయిన తర్వాత మోడీ మౌనం విరిగిపోయింది. దీంతో విస్తృతంగా విమర్శలు వెలువెత్తాయి. కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య మణిపూర్ హింసపై మోడీ మౌనం భారత దేశంలో అత్యంత బిగ్గరగా శబ్దం’ అని ఎక్స్‌లో విమర్శకుడు పేర్కొన్నారు. పునరావాసంలోనూ వివక్ష, కేంద్ర ప్రత్యక్ష పాలలో కూడా పునరావాస శిబిరాల్లో 60 వేల మందికి ఇచ్చిన హామీలు నెరవేరలేదు. దారుణమైన పరిస్థితులు కొనసాగుతున్నాయి.

2024 లోక్‌సభ ఎన్నికల్లో మణిపూర్‌లో బిజెపి ఓటమి పాలైంది. రెండు పార్లమెంటు స్థానాలను కోల్పోవడం, ఆ పార్టీ ప్రజల్లో కోల్పోయిన నమ్మకానికి అద్దం పట్టింది. సంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు అయిన మైయితీలు, పాలనా వైఫల్యాల కారణంగా ఆ పార్టీని తిరస్కరించారు. అయితే కుకీలు బిజెపిని బహిష్కరించింది, మెయితీలు దూరమయ్యారు. 2023 జూన్‌లో తొమ్మిదిమంది బిజెపి మెయితీ ఎంఎల్‌ఎలు మోడీకి లేఖ రాస్తూ, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. కుకీలే లక్ష్యంగా, హింస వివక్ష సాగుతోంది. కుకీలు పార్టీని జాతి ప్రక్షాళనకు దోహదపడేవారిగా చూస్తున్నారు. కుకీ మహిళా ఫోరమ్ పుస్తకం సైలెంట్ స్కార్స్ ప్రకారం 25 నెలల నిశ్శబ్దంగా, కుకీ జో మహిళలు మోడీని దూరం పెట్టి, బాధలను భరిస్తున్నారు. అక్రమ ఆయుధాలు ఇక్కడి హింసాకాండను మరింత తీవ్రతరం చేశాయి. 2023లో ఆర్మీనుంచి 6,000కు పైగా ఆయుధాలు దోచుకోబడ్డాయి. మెయితీ అరంబాయి, టెంగోల్, కుకీ గ్రూప్‌లకు చెందిన ఎందరో సాయుధులను అరెస్ట్ చేశారు. న్యాయవ్యవస్థ కుప్పకూలింది. పక్షపాతం చూపుతారనే భయాల కారణంగా విచారణలను మణిపూర్ వెలుపలకు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

భారతదేశం మయన్మార్ సరిహద్దు వెంబడి 16 కిలోమీటర్ల వరకూ వీసాలతో నిమిత్తం లేకుండా స్వేచ్ఛగా వెళ్లే -ఫ్రీ మూవ్‌మెంట్ రిజిమ్ (ఎఫ్‌ఎంఆర్) అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో రదు చేసింది. ఇది కుకీలు, నాగాలను బాధించింది. సరిహద్దుల వారి బంధువులు ఉండడంతో సులభంగా రాకపోకలు జరిగి బంధాలు గట్టిపడేవి. మణిపూర్ హింసకు ఆజ్యం పోస్తున్న చొరబాటుదారులకు వ్యతిరేకంగా, భద్రతా పరమైన చర్యగా ప్రభుత్వం పేర్కొన్నా.. అది కుటుంబ, సాంసృ్కతిక ఆర్థిక సంబంధాలను తెగతెంపులు చేసేదిగా ఆయా కమ్యూనిటీలు భావించాయి. ఈ అంశంపై కుకీ చీఫ్ అసోసియేషన్ వంటి కుకీ గ్రూప్‌లు, యునైటెడ్ నాగా కౌన్సిల్ వంటి నాగా సంస్థలు నిరసన వ్యక్తం చేయడమే కాక, అది అశాంతికి దారితీసే నిర్ణయంగా హెచ్చరించాయి. సరిహద్దులలో కంచె నిర్మించాలనే ప్రణాళికలపై యునైటెడ్ నాగా కౌన్సిల్ 2025 సెప్టెంబర్ లో నిషేధం విధించింది. దీనివల్ల మయన్మార్ లోని చిన్ రాష్ట్రంలో బంధువులతో కుకీలకు ఉన్న సాంసృ్కతిక సంబంధాలను దెబ్బతీస్తుంది. ఈ చర్య బహుళజాతినెట్ వర్క్ కలిగిన మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా అరికట్టడానికి దోహదపడవచ్చు కానీ, సరిహద్దు వాస్తవాలను విస్మరిస్తుందని ఒక నాగా నాయకుడు పేర్కొన్నారు. బీరేన్ సింగ్ కుకీ వ్యతిరేక వైఖరితో ముడి పడిన ఈ విధానం తమను మరింత పరాయిగా చూస్తున్నారనే వాదనను మరింత తీవ్రతరం చేస్తోంది.

మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రజలలో ముఖ్యంగా ఈ కమ్యూనిటీలలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి సమగ్రమైన రోడ్‌మ్యాప్ అవసరం. మొదట పునరావాస శిబిరాలను అప్ గ్రేడ్ చేసేందుకు రూ. 500 కోట్లు కేటాయించడం ద్వారా తక్షణ మానవతా సహాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. 60 వేల మంది నిరాశ్రయులకు పౌష్టికాహారం, ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి సౌకర్యాలను పూర్తిస్థాయిలో కల్పన చేపట్టాలి. వారి బాధలను, ఇబ్బందులను పరిష్కరించడానికి, సమాజాలలో సద్భావన పెంపొందించడానికి భద్రతా హామీల అమలు పూర్తి స్థాయితో వేగవంతం చేయడం అవసరం. రెండవది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పాత్రలను దర్యాప్తు చేయడానికి జస్టిస్ అజయ్ లంబా కమిషన్‌ను విస్తరించడం, అన్ని విచారణలను సిబిఐ పర్యవేక్షణలో తటస్థ ప్రదేశాలకు మార్చడం, విచారణ సంస్థలపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి నిఘా సంస్థలు, పోలీసుల పాత్రను విచారించడం ద్వారా స్వతంత్ర విచారణ ద్వారా న్యాయాన్ని నెలకొల్పడం అవసరం.

మూడవది, కుకీ జో కమ్యూనిటీలకు శాసనసభ అధికారాలతో స్వయంప్రతిపత్తి కల్పించేందుకు, కేంద్రం, మైయితీ, కుకీ ప్రతినిధులతో కూడిన త్రైపాక్షిక చర్చలను ఏర్పాటు చేయడం. స్వయంప్రతిపత్తిని పెంపొందించడం, నాల్గవది, బంధువుల సందర్శనలను అనుమతించడానికి బయోమెట్రిక్ తనిఖీను పునరుద్ధరించడం ద్వారా సరిహద్దు, ఆర్థిక విధానాలను సంస్కరించడం, వాణిజ్య కేంద్రాలలో పెట్టుబడులు పెట్టడం, కుకీ, నాగా ఫిర్యాదుల పరిష్కారం, మాదకద్రవ్యాలు, ఆయుధ అక్రమ రవాణాను పరిష్కరించడానికి యుఎన్‌ఒడిసి మద్దతుతో బహుళజాతి మాదకద్రవ్య వ్యతిరేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రారంభించడం, చివరిగా సామాజిక శాంతి కమిటీలు, ఉమ్మడి సాంసృ్కతిక ఉత్సవాలు, చేపట్టడం, విద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేందుకు మీడియా మార్గదర్శకాలకు నిధులు సమకూర్చడం, సామాజిక నిర్మాణాన్ని చక్కదిద్దడం. మణిపూర్ ప్రజలు గౌరవం, న్యాయం, శాంతిని కోరుకుంటున్నారు. సైనిక కవాతులు కాదు. మోడీ పర్యటన ఈశాన్యంలో వెలుగును అందిస్తోంది. నిజమైన పురోగతికి అందరినీ కలుపుకునే చర్యలు అవసరం. బిజెపి మెయితీ అనుకూల వైఖరి మాని, మణిపూర్ సమగ్రతకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలి. అదిలేని పక్షంలో, మణిపూర్ శాశ్వతంగా విభజనకు లోనయ్యే ప్రమాదం ఉంది. కొండలు మరింత విరిగిపోవచ్చు. కానీ, ధైర్యంతో అవి సరిదిద్దగలవు, ఇప్పుడు నిర్ణయం కేంద్రం చేతిలో ఉంది. ప్రభుత్వం ఈ అవకాశాన్ని సక్రమంగా నిర్వహిస్తుందా?.

Also Read: వెనెజువెలాపై యుద్ధ మేఘాలు

గీతార్థ పాఠక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News