Tuesday, September 16, 2025

ఇంటి ముందు కాల్పులు.. దిశా పటానీకి హామీ ఇచ్చిన సిఎం

- Advertisement -
- Advertisement -

లక్నో: ఇటీవల నటి దిశా పటానీ (Disha Patani) ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో నటి కుటుంబానికి ఉత్తర్‌ప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. కాల్పుల ఘటనపై సిఎం ఆరా తీశారు. దిశా తండ్రికి సిఎం ఫోన్ చేసి కాల్పులకు పాల్పడిన వారిని కచ్చితంగా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని దిశా తండ్రి జగదీష్ వెల్లడించారు.

‘‘యోగి ఆదిత్యనాథ్ మాకు ఫోన్ చేశారు. మా కుటుంబానికి ధైర్యం ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మాకు అండగా ఉంటుందని తెలిపారు. మాకు పూర్తి భద్రత ఇస్తానని అన్నారు. ఈ విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయమని తెలిపారు. ఈ చర్యకు పాల్పడిన వారు అండర్‌గ్రౌండ్‌లో దాక్కున్న పట్టుకుంటామని హామీ ఇచ్చారు’’ అని జగదీష్ తెలిపారు.

అసలేం జరిగిందంటే.. బరేలీలోని దిశా పటానీ (Disha Patani) ఇంటి ముందు సెప్టెంబర్ 12న కాల్పులు చోటు చేసుకున్నాయి. ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా దిశా సోదరి ఖుష్బూ వ్యాఖ్యలు చేశారనే కారణంగా ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులు తామే జరిపినట్లు గోల్టీ బ్రార్ గ్యాంగ్ ప్రకటించింది. మాజీ ఆర్మీ అధికారిణిగా పని చేసిన ఖుష్భూ ప్రస్తుతం ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేస్తున్నారు.

Also Read : సినిమాల చిత్రీకరణ మరింత సులభతరం: దిల్ రాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News