Tuesday, September 16, 2025

ఆ నిర్ణయం సరికాదు.. ‘మా ఐన్‌స్టీన్’ అంటూ అక్తర్ అసహనం..

- Advertisement -
- Advertisement -

ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నో టెన్షన్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ జట్టుపై ఆ దేశ అభిమానులు, మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ కెప్టెన్ సల్మా అలీ అఘా టాస్ సమయంలో తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) తప్పుబట్టారు. టీం ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

‘‘సూర్యకుమార్ యాదవ్ టాస్ సందర్భంగా మొత్తం పిచ్ రిపోర్ట్ చెప్పేశాడు. ‘ఆటలో తర్వాత తేమ ప్రభావం చూపే అవకాశం ఉంది. అప్పుడు చక్కగా బంతి బ్యాట్ మీదకు వస్తుంది. మా బ్యాటింగ్ లైనప్ చాలా డెప్త్‌గా ఉంది. మేం మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాం’ అని అన్నాడు. కానీ మా ఐన్‌స్టీన్(అఘా) మాత్రం పిచ్ గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు’’ అని అక్తర్ (Shoaib Akhtar) అసహనం వ్యక్తం చేశారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 25 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి.. 131 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది.

Also Read : ఐసిసి ప్లేయర్ ఆఫ్‌ది మంత్‌గా సిరాజ్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News