అమరావతి: మొదటి సారి సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడ పచ్చదనం- పరిశుభ్రతపై పరిస్థితిని అధ్యయనం చేశానని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పొరుగుసేవల సిబ్బందిని నియమించడం కూడా అదే తొలిసారి అన్నారు. సిఎం అధ్యక్షతలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. హైదరాబాద్ లో నైట్ క్లీనింగ్ ప్రారంభించామని, పచ్చదనం- పరిశుభ్రత కార్యక్రమం తీసుకొచ్చామని తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛభారత్ రిపోర్టు తానే ఇచ్చానని, స్వచ్ఛత అంటే శుభ్రతే కాదని అన్ని కోణాల్లో చూడాలని అన్నారు.
ఒకప్పుడు ఆనంద ఆదివారం కూడా పెట్టామని, ఎవరికి ఏ ప్రతిభ ఉంటే దాన్ని బయటపెట్టేవాళ్లు అని పేర్కొన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కొన్ని కార్యక్రమాలు వచ్చాయని, లాఫింగ్ సొసైటీ, షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయని చెప్పారు. సర్క్యూలర్ ఎకానమీ పాలసీని అమలు చేస్తామని, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పై దృష్టి పెట్టాలని సూచించారు. డ్రయిన్లను శుభ్రం చేయాల్సి ఉంటుందని, వర్షపు నీరు, ఇళ్లలోని నీరు వస్తే ఇంకిపోయేలా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చామని అన్నారు. ఎకో టూరిజంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, అక్టోబర్ 2 నాటికి చెత్త అనేదే కనబడకూడదని అధికారులకు హెచ్చరించారు. అనవసర చెత్త కనబడితే ఊరుకునేది లేదని, చెత్త పై పన్ను కూడా తొలగించామని చంద్రబాబు స్పష్టం
చేశారు.
Also Read : రైతులను పట్టించుకోని కూటమి సర్కార్ పై జగన్ ఆగ్రహం