టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ వస్తుందని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ అందులో ఏ ఒకటి నిజం కాలేదు. కానీ, క్రికెట్ అభిమానులు, ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్‌కి మాత్రం ఆతడి బయోపిక్‌కి చూడాలని ఎంతో ఆతృతగా ఉంది. తాజాగా ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు (Anurag Kashyap) కోహ్లీ బయోపిక్ గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. కోహ్లీ బయోపిక్‌ను చేయనని ఆయన అన్నారు. కోహ్లీ అంటే తనకు అభిమానమే కానీ, బయోపిక్‌ను మాత్రం తెరకెక్కించను అని తేల్చి చెప్పేశారు.
‘‘కోహ్లీ ఇఫ్పటికే క్రికెట్ అభిమానులతో పాటు ఎంతోమంది దృష్టిలో హీరో. చిన్న పిల్లలు కూడా అతడిని విపరీతంగా అభిమానిస్తారు. ఒకవేళ నేను ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే.. కష్టమైన సబ్జెక్ట్‌ని ఎంచుకుంటాను. ఒక సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపైన చూపిస్తాను. కోహ్లీ చాలా గొప్ప వ్యక్తి. నాకు వ్యక్తిగతంగా తెలుసు. అందంలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ ఆయన ప్రశంసనీయుడు. త్వరగా ఎమోషనల్ అవుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే.. కోహ్లీ ఒక అద్భుతం’’ అని అనురాశ్ కశ్యప్ (Anurag Kashyap) అన్నారు.
Also Read : గొప్ప సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాను: గౌర హరి