Wednesday, September 17, 2025

మసూద్ కుటుంబం ముక్కలైపోయింది: జైషే అగ్ర కమాండర్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: గత మే నెలలో భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఉగ్రవాద నాయకుడు మసూద్ అజర్ కుటుంబంలో పిల్లాపాపలతో సహా కుటుంబ సభ్యులంతా మరణించారని తొలిసారిగా జైషే మొహమ్మద్ అంగీకరించింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జైషే అగ్రకమాండర్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడుతూ.. ఇటీవల మనకు తీవ్ర నష్టం వాటిల్లందని వ్యాఖ్యానించారు. మే 7న బహవల్ పూర్ లోని జైషే ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాపై జరిగిన దాడిలో మసూద్ అజర్ కుటుంబంలోని పిల్లలతో సహా అందరూ మరణించారని, అంతా చిధ్రమైపోయారని ఇలియాస్ కశ్మీరీ పేర్కొన్నారు.

ఉగ్రవాదంలో చేరి దేశ సరిహద్దులను రక్షిస్తున్నామని కశ్మీరీ గర్వంగా చెప్పుకొచ్చాడు. ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లతో పోరాడమని వివరించాడు. ఈ దేశం కోసం అన్నింటినీ త్యాగం చేశామని చెబుతూ దేశ రహస్య స్థావరాల్లోకి భారత్ ఎలా చొచ్చుకొచ్చిందన్న అంశాలను కూడా ఇలియాస్ చెప్తున్నట్లు వీడియో వైరల్ అయ్యింది. ఫిబ్రవరి 22న పహల్గాం లో జరిగిన టెర్రరిస్ట్ దాడిలో 26 మంది టూరిస్ట్ లు మరణించిన తర్వాత ఆ ఘటనకు ప్రతీకారంగా భారత సైనిక దళాలు మే 7న తెల్లవారు జామున ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా భహవల్పూర్ తో పాటు మరో ఎనిమిది టెర్రరిస్ట్ స్థావరాలను భారత దళాలు నేలమట్టం చేశాయి.

ఈ ఆపరేషన్ లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. లాహోర్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్ పాకిస్తాన్ లోని 12వ అతిపెద్దనగరం. ఈ దాడిలో మసూద్ కుటుంబంలో మసూద్ సోదరి, ఆమెభర్త, అతడి మేనల్లుడు, మేనకోడలు వారి కుటుంబంలోని పిల్లలతో సహా దాదాపు పదిమంది చనిపోయారు. అజర్ అత్యంత సన్నిహితులైన సహాయకులు నలుగురు కూడా మరణించారు.

Also Read: దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. విదేశీ ఉద్యోగులను నియమించుకోండంటూ పోస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News