మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ శాఖ లో కొత్త డిస్కం ఏర్పాటుకు సిఎం రేవంత్‌రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ అంశాన్ని కేబినెట్‌లో చర్చించి త్వ రలో ఆమోదించనున్నట్లు వెల్లడించారు. అలాగే ప్రస్తు తం ఉన్న రెండు డిస్కంలను మూడుగా విభజించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు వీలైనంత త్వ రగా కొత్త డిస్కం ఏర్పాటుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని తెలిపారు. ఇంధన శాఖ పై మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సం బంధిత శాఖ మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, జెన్‌కో సిఎండి హరీష్‌రావు, సింగరేణి సిఎండి బలరాం, ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్, ఎన్‌పిడిసిఎల్ సిఎండి వరుణ్‌రెడ్డి, రెడ్‌కో చైర్మన్ శరత్‌లతో సిఎం చర్చించారు. వ్యవసా యం, మేజర్, మైనర్ లిఫ్ట్ ఇరిగేషన్, గ్రామీణ మంచినీటి సరఫరా, జిహెచ్‌ఎంసి పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డి స్కం పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
విద్యుత్ కేబుళ్లలతోపాటు అండర్‌గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను రూ పొందించుకోవాలని సిఎం ఆదేశించారు. ఇప్పటికే ఈ తరహాలో ఉన్న కర్ణాటకలోని బెంగుళూరు నగరానికి వె ళ్లి అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ కేబులింగ్‌తో పాటు ముందుగా కోర్ అర్బన్ రీజియన్‌లో విద్యుత్ సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయాలని సిఎం అధికారులకు సూచించారు. ఓవర్ లోడ్ సమస్య తలెత్తకుండా లోడ్ రీప్లేస్‌మెంట్ చర్యలు చేపట్టాలని తెలిపారు. సబ్ స్టేషన్ కెపాసిటీ కంటే ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అవసరమైనచోట సబ్ స్టేషన్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. కోర్ అర్బన్ రీజియన్‌లో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ల అవసరం ఉందో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అర్బన్ ఏరియాలలో విద్యుత్ సబ్ స్టేషన్‌లలో అధునాతన సాంకేతికను ఉపయోగించాలన్నారు. విద్యుత్ కేబుల్స్‌తో పాటు ఇతర కేబుల్స్ కూడా అండర్ గ్రౌండ్ కేబులింగ్ వ్యవస్థను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. డిసెంబరులోగా అండర్ గ్రౌండ్ కేబులింగ్‌కు ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్ధేశం చేశారు. వచ్చే రెండున్నరేళ్లలో కోర్ అర్బన్ రీజియన్‌లో అండర్ గ్రౌండ్ కేబులింగ్ పూర్తి చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
Also Read: గుట్టలుగా నోట్ల కట్టలు.. ఎసిబికి చిక్కిన మరో అవినీతి తిమింగలం