మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యా నర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నా రు. అర్చన గర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కో సం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్ వేస్తున్నట్లు సమాచారం. ఇది చాలా కీలకమైన షె డ్యూల్ అని, కీలక సన్నివేశాలను ఈ సెట్‌లోనే చి త్రీకరించనున్నారట. అన్నట్టు ఈ సినిమాలో మె గాస్టార్ చేస్తున్న రోల్‌లో చాలా వేరియేషన్స్ ఉం టాయని తెలిసింది.
Also Read: గంభీర జీవితాన్ని మలుపు తిప్పే కణ్మనిగా కనిపిస్తా..
ఈ సినిమా సెకండ్ హాఫ్‌లో వచ్చే ఓ స్పెషల్ ఎపిసోడ్‌లో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఉందట. కాగా ఈ పోలీస్ పాత్రలోనే హీరో వెంకటేష్ నటించబోతున్నాడు. ఇక ఈ సినిమా గురిం చి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు నచ్చిందని చెప్పారు. అనిల్ రావిపూడి చెప్పిన సీన్స్ గురించి కూడా మెగాస్టార్ చెబుతూ.. “సినిమాలో ఆయా సన్నివేశాల గురించి అనిల్ రావిపూడి నాకు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాను. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది” అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇదిలాఉండగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్‌బస్టర్ ’కిష్కింధపురి’ చిత్రాన్ని అభినందించారు మెగాస్టార్ చిరంజీవి.
కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేక వీడియోలో తన రివ్యూని షేర్ చేశారు. “నా రాబోయే చిత్రం ’మన శంకర వరప్రసాద్ గారు’ పండక్కి వస్తున్నారు. నిర్మాత సాహూ గారపాటి మరో చిత్రం కిష్కింధపురి విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా చూసిన నాకు మంచి ప్రయత్నం చేశారని అనిపించింది. ఆ సినిమాలో పనిచేసిన అందరికీ అభినందనలు”అని చిరంజీవి అన్నారు.