డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్‌లో క్లౌడ్ బరస్ట్ (Cloudburst in Dehradun) జరిగింది. కుండపోత వర్షాలు కురవడంతో సహస్రధారా నదితో వాగులు వంకలు వరదల్లో ప్రమాద స్థాయిని దాటి ప్రహిస్తున్నాయి. వరదల్లో వాహనాలు చిక్కుకున్నాయి. ఒక్కసారిగా రహదారులపై వరద ఉప్పొంగడంతో వాహనాలు చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బాధితులను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. వరదల్లో చిక్కుకున్న వారిని తాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: సర్ఫరాజ్‌కు మెట్రో బాధ్యతలు
ఉత్తర భారతంలో భారీ వర్షలు కురవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. (Cloudburst in Dehradun) హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలో భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ ప్రాంతం వికాస్‌నగర్‌లో అసన్ నది పోటెత్తడంతో వరదల్లో 14 మంది గల్లంతైన విషయం తెలిసిందే. 14 మంది కూలీలతో ఉన్న ట్రాక్టర్ కొట్టుకపోయింది. నది ఒడ్డున మైనింగ్ పనుల కోసం ట్రాక్టర్‌లో 14 మంది కూలీలు వెళ్లారు. వారిలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డాడు. మిగిలిన 12 మంది కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.