హైదరాబాద్: ఫోన్‌లో మాట్లాడుతుందని తల్లి మందలించినందుకు నవ వధువు ఉరేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లోని మూసాపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. యాదవబస్తీలో జానకీ రావు అనే వ్యక్తి తన భార్య తులసమ్మ, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఉంటున్నాడు. పెద్ద కుమార్తె రమ్యకు అశోక్ అనే యువకుడితో మూడు నెలల క్రితం పెళ్లి చేశాడు. రమ్య తన భర్తతో కలిసి పుట్టింటికి వచ్చింది. తులసమ్మ తన కూతురు రమ్యను మార్కెటికి తీసుకెళ్లి మళ్లీ ఇంటికి తిరిగి వచ్చారు. నవ వధువు ఫోన్‌లో మాట్లాడుతూ ఉండగా ఫోన్‌లో మాట్లాడడం కాదు సంసారం బాధ్యతలు గుర్తించి నిర్వర్తించాలని కూతురును హెచ్చరించింది. మనోవేదనకు గురైన కూతురు రూమ్‌లో వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులు రూమ్‌కు వెళ్లిచూడగా ఉరేసుకొని కనిపించింది. కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: సర్కార్‌ను నడిపే సత్తా రేవంత్‌కు లేదు