అమరావతి: కూతురు వరసయ్యే యువతికి బాబాయి వాట్సాప్ లో వీడియో కాల్స్, అర్థనగ్న ఫోటోలు, అసభ్యకర మెసేజ్ పంపి లైంగికంగా వేధించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుకొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పెనుకొండ మండలంలో ఓ గ్రామానికి చెందిన బాబాయ్ వెంకట్ రెడ్డి తన అన్న కూతురిని ఫోన్ లో లైంగిక వేధించాడు. అర్థరాత్రి యువతికి న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ అసభ్యకర మెసేజ్ లు బాబాయ్ పంపించాడు. లైంగిక వేధింపులు తాళలేక కియా పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాబాయే కదా అని ఫోన్ నెంబర్ ఇచ్చిన పాపానికి ప్రైవేట్ పార్ట్స్ ఫోటో తీసి యువతికి వెంకట్ రెడ్డి పంపాడు. పిన్ని ఊరికి వెళ్ళింది అంటూ అసభ్యకర మెసేజ్ లు కూడా పంపించాడు. అశ్లీల ఫోటోలు పంపిన బాబాయ్ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: మంచినీళ్ల బాబా… ముంచేస్తున్నాడు