Wednesday, September 17, 2025

నెల్లూరులో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్-కారు ఢీకొని ఏడుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాంగ్ రూట్ వేగంగా వచ్చిన టిప్పర్ లారీ కారును ఢీకొట్టినట్టు పోలీసులు గుర్తించారు. కారు ముందుభాగం నుజ్జునుజ్జుగా మారింది. ఈ ప్రమాదానికి రాంగ్ రూటే కారణమని పోలీసులు భావిస్తున్నారు.  ఇసుక టిప్పర్లు ఇష్టానుసారంగా నడుపుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: విలీనమా.. విద్రోహమా.. విమోచనమా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News