అమరావతి: ఇప్పటికే అనేక రంగాల్లో జిఎస్టి ప్రయోజనాలు చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జిఎస్టి స్లాబులను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అన్నింటినీ కలిపి ఒకే పన్ను, నాలుగు స్లాబ్ లుగా తీసుకొచ్చిందే జిఎస్టి అని తెలియజేశారు. 2017 కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేదని, 2017 కు ముందు 65 లక్షల మంది పన్ను చెల్లించే వారని అన్నారు. ఈ 8 ఏళ్లలో పన్ను చెల్లింపు దారులు 1.51 కోట్లకు చేరారని, 2018 లో జిఎస్టి ద్వారా రూ. 7.19 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని కొనియాడారు. 2025 లో జిఎస్టి ద్వారా రూ. 22.08 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, ప్రజలపై భారం తగ్గించేందుకే జిఎస్టి తీసుకొచ్చామని అన్నారు.
వెన్న, నెయ్యి, వంటపాత్రలను 12 నుంచి 5 శాతానికి, పప్పులు, చింతపండు, ఉప్పు, హెయిర్ ఆయిల్, షాంపును 18 నుంచి 5 శాతానికి తీసుకొచ్చామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మధ్యతరగతి ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకున్నామని, కారు, ఫ్రిజ్, ఎసిని 28 శాతానికి తీసుకొచ్చామని చెప్పారు. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేశామని, పురుగులమందులు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను దృష్టిలో పెట్టుకున్నామని అన్నారు. సులభమైన పన్ను విధానం తేలేని వారు ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. యూపిఎ హయాంలో 30 శాతం పన్ను ఉన్న వాటిని 5 శాతానికి తెచ్చామని, మహిళల శానిటరీ న్యాప్ కిన్స్ పై పూర్తిగా పన్ను తొలగించామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
Also Read : అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: పొన్నం ప్రభాకర్