మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా ఆయన ఫిర్యాదులతో ఇతర సినిమా వాళ్లకు దడ పుట్టిస్తున్నారు. తాజాగా ఆయన మరో సినిమాపై కాపీరైట్ ఫిర్యాదు చేశారు. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాపై ఇళయరాజా ఫిర్యాదు చేయడంతో ఆ సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించారు. తన అనుమతి లేకుండా ఈ సినిమాలో తన పాటలను ఉపయోగించారని ఇళయరాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది కాపీరైట్ చట్టానికి విరుద్ధమని.. ఆ పాటలను తొలగించడమే కాకుండా.. పాటలను ఉపయోగించినందుకు తనకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీనిపై విచారణ జరిపిన మద్రాస్ కోర్టు ఇళయరాజా (Ilayaraja) పాటలను సినిమాలో ప్రదర్శించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ ఆ సినిమాను తొలగించింది. అయితే ఈ వివాదంపై ఇప్పటికే చిత్ర నిర్మాత రవి మాట్లాడారు. సినిమా విడుదలకు ముందే తాము అన్ని పర్మిషన్లు తీసుకున్నామని ఆయన అన్నారు. నిబంధనలకు అనుగుణంగా పాటలను ఉపయోగించామని పేర్కొన్నారు. అయితే నెట్‌ఫ్లిక్స్ ఆ పాటలను తొలగించి సినిమాను మళ్లీ ప్రదర్శిస్తుందా.. లేదా పూర్తిగా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తుందా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.
ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా విడుదలైంది. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా దాదాపు రూ.250 కోట్లు వసూళ్లు చేసింది. ఈ ఏడాది మేలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. ఇక ఈ సినిమాలో త్రిష, సిమ్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, సునీల్, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Also Read : ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ టీజర్ విడుదల..