తిరువనంతపురం: కేరళలోని (Kerala) ఓ వృద్ధుడి ఇంట్లో భారీగా ఆయుధాలు లభించడం కలకం సృష్టిస్తోంది. భారీగా ఆయుధాలతో పాటు.. మందు గుండు సామాగ్రి కూడా దొరికాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మలప్పురం జిల్లాలో నివసిస్తున్న ఉన్నికమద్ (60) ఇంట్లో ఆయుధాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 20 ఎయిర్ గన్‌లు, మూడు రైఫిల్స్, 40 పెల్లెట్ బాక్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఉన్నికముద్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఆయుధాలను నిందితుడు ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడనే కోణంలో దర్యాప్తు (Kerala) చేపట్టారు. ఆయుధాలను అమ్మేందుకు తీసుకొచ్చారా.. లేదా వ్యక్తిగతంగా ఉపయోగించుకునేందుకా.. అనే విషయంలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : దారుణం.. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను తోసి చంపిన సవితి తల్లి